ఏపీ గవర్నర్ తో ఇండొనేషియా కాన్సుల్ జనరల్ భేటీ

  • రాజ్ భవన్ కు వెళ్లిన కాన్సుల్ జనరల్ అగస్ పి. సప్టోనో
  • రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని చెప్పిన గవర్నర్
  • రాష్ట్ర ప్రభుత్వం రాయితీలను అందిస్తుందన్న గవర్నర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో ఇండొనేషియా కాన్సుల్ జనరల్ అగస్ పి. సప్టోనో భేటీ అయ్యారు. రాజ్ భవన్ కు వెళ్లిన ఆయన గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో సమకాలీన అంశాలపై వీరు చర్చించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, దేశంలోనే రెండవ పొడవైన సముద్ర తీరప్రాంతంతో పాటు పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, సహజవనరులు ఏపీలో ఉన్నాయని కాన్సుల్ జనరల్ కు వివరించారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టే వారికి రాష్ట్ర ప్రభుత్వం రాయితీలను అందిస్తుందని చెప్పారు.

Andhra Pradesh
Governor
Biswabhusan Harichandan
Indonesia
Consul General

More Telugu News